చీరాల పట్టణంలోని పదహారో మున్సిపల్ వార్డులో గోలి నాగలక్ష్మి (30)అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం ఆమె తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించగా కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాస్పత్రికి పంపారు. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.