కడప పట్టణం విశాఖపట్టణం తరహాలో నగరపాలక సంస్థ నాలుగు జోన్లుగా విభజించే సాహసం చేయనున్నారు. మొత్తం 50 డివిజన్లో ఈస్ట్: 13, వెస్ట్: 10, నార్త్: 14, సౌత్: 13 డివిజన్లు గా విభజన చేయనున్నారు. వీటికి ఉప కమిషనర్లు ఇన్చార్జిలుగా ఉంటారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడానికి నగర పాలక సంస్థ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనుంది.