రహదారి నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఎస్ఐ తిరుపాల్ నాయక్ హెచ్చరించారు. వేంపల్లె పంచాయతీ పరిధిలోఆయన వాహనాల తనిఖీ చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానా విధించారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం అనేక నిబంధనలు, షరతులు విధించిందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి వాహనదారుడు లైసెన్సు పొంది ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa