లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో సర్పంచు ప్రతాప్ ఆధ్వర్యంలో ఓటీఎస్ చెల్లించిన సుమారు 16 మంది లబ్దిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పట్టాలను పంపిణీ చేశారు. వైసీపీ నాయకుడు మాట్లాడుతూ పేదలకు గృహలపై పట్టా హక్కు కల్పించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. బ్యాంక్ ల నుంచి రుణం పొందే అవకాశం కూడా ఉందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్యామ్ సుందర్‌రెడ్డి, గీత, సమాఖ్య అధ్యక్షురాలు. పాల్గొన్నారు.