ఇంటింటికి సీపీఎం, జనం కోసం సీపీఎం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జమ్మలమడుగు అర్అండ్ బి భవనంలో సీపీఎం కార్యదర్శి శివ నారాయణ కరపత్రం ఆవిష్కరించారు. ప్రజా సమస్యలను నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని సీపీఎం పార్టీ నిర్వహిస్తున్నదని, 11 తేదీ నుండి జమ్మలమడుగు పట్టణం లో కూడా ప్రధాన వార్డులలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సీపీఎం పార్టీ ఇంటింటి కి వెళ్ళడం జరుగుతుందని అన్నారు.