ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితులను హాజరుపరిచారు. రూ. 13 లక్షల విలువ గల 271 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలో జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలో పలు దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు.