రైల్వే కోడూరు పట్టణంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ వల్ల పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు. తిరుపతి నుండి కర్నూలుకు హైవే రోడ్డు కావడంతో కోడూరు పట్టణంలో భారీ వాహనాలు ఎక్కువగా ప్రయాణిస్తుంటాయి. పాదచారులు రోడ్డుకు ఒక వైపు నుండి ఇంకో వైపు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి కోడూరులో ఉంది. ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నా అంతంత మాత్రంగానే ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు.