సాధారణంగా అన్ని దేశాలు గంజాయిని మాదక దవ్ర్యాలలో ఒకటిగా చూస్తాయి. భారత దేశంలోనూ గంజాయి సాగు, వినియోగంపై నిషేధం ఉంది. అయితే ఆసియా ఖండంలోనే భాగమైన థాయిలాండ్‌లో గంజాయిపై నిషేధాన్ని అక్కడి ప్రభుత్వం తొలగించింది. వైద్యానికి గంజాయి ఎంతగానో ఉపయోగపడుతుందని, తామే 10 లక్షల గంజాయి మొక్కలను శుక్రవారం నుంచి ప్రజలకు పంపిణీ చేయనున్నట్లు థాయ్ ఆరోగ్య మంత్రి అనుటిన్ చార్న్ విరాకుల్ వెల్లడించారు.