ఏపీలోని అనంతపురానికి చెందిన బాలకృష్ణసింగ్, తిరుపతి సమీపంలోని కలువాయి మండలానికి చెందిన యువతికి 4 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో ఏడాది క్రితం ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అందరి సమక్షంలో వైభవంగా చేస్తామని నమ్మించి తమ కుమార్తెను తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెకు మరో పెళ్లి చేసేశారు. ఇది తెలిసిన బాలకృష్ణ బుధవారం ఆత్మహత్యాయత్నం చేశాడు.