తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ పార్టీ ఇంచార్జి గౌతు శిరీషకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు.ఈ నెల 20న గుంటూరులోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు శుక్రవారం ఆమెకు నోటీసులు జారీ చేశారు.ఐటీ చట్టం కింద నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు సహకరించాలని సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.