ఎర్రగొండపాలెంలో ఇటీవలి భూ వివాదాల ఆరోపణలు, హత్యోదంతం కేసులో ఇద్దరు వీఆర్వోలను కలెక్టర్ దినేష్ కుమార్ సస్పెండ్ చేశారు. రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఫిరోజ్ పైనా చర్యలు తీసుకోనున్నారు. ఎర్రగొండపాలెం-1 వీఆర్వో కోటేశ్వరరావు, గుర్రపుశాల వీఆర్వో నాగమణి పైనా ఆరోపణలు రుజువు కావడంతో వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇంచార్జి తహసీల్దారు వీరయ్యను సస్పెండ్ చేయడం తెలిసిందే.