హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ ఎండీ గుప్తాకు సోషల్ మీడియాలో ఢిల్లీ యువతి పరిచయం అయింది. అతడు ఇటీవల తనను 5 స్టార్ హోటల్‌కి పిలిపించి, కూల్‌డ్రింక్‌లో డ్రగ్స్ ఇచ్చి మత్తులోకి వెళ్లాక అత్యాచారం చేశాడని ఆరోపించింది. గుప్తాపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టగా పరారీలో ఉన్నట్లు తేలింది.