రాజస్థాన్‌కు చెందిన యువతి పూర్వ జిందాల్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. వారి కుటుంబానికి వస్త్ర వ్యాపారం ఉంది. అయితే ఇటీవల కాలంలో ఆమె దృష్టి సేంద్రీయ వ్యవసాయం పైకి మళ్లింది. వ్యాపారం వదిలి సాగు బాట పట్టింది. రైతులు, వ్యవసాయ నిపుణుల వద్ద మెళకువలు నేర్చుకుంది. ఆర్గానిక్ ఆకుకూరలు, కూరగాయలు పండించడం ప్రారంభించింది. సిబ్బందికి జీతాలు పోనూ రోజుకు రూ.7 వేల వరకూ ఆదాయం వస్తోంది. పలువురికి సేంద్రీయ ఆహారంపై అవగాహన కల్పిస్తోంది.