జేఎన్‌టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్, ఫార్మసీ ఫైనలియర్ విద్యార్థులకు తమ సొంతూళ్లకు దగ్గర్లోనే పరీక్షలు రాసేందుకు వెసులుబాటును ఈసారి కూడా కొనసాగించనుంది. విద్యార్థులు క్లస్టర్ల వారీగా 3 కాలేజీలను ఎంచుకుంటూ ఈ నెల 19లోగా ఆప్షన్లను సమర్పించాలని వర్సిటీ పరీక్షల విభాగం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు సెలెక్ట్ చేసుకునే 3 కాలేజీల్లో ఒకటి కచ్చితంగా జేఎన్‌టీయూ అఫిలియేటెడ్ కాలేజ్ ఉండాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa