బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్ వంటి డ్రైఫ్రూట్స్ తో ముఖానికి నునుపుదనం వస్తుంది. వీటిలో పిండి పదార్థం తక్కువ ఉంటుంది. దీంతో ఊబకాయం రాదు. టైప్-2 డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. వీటిల్లో ఉండే పాలిఫెనోల్స్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. మధుమేహం, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు డ్రైఫ్రూట్స్ తింటే కొంత ఉపశమనం లభిస్తుంది. వీటిల్లో ఉండే పీచు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.