గుంటూరు జిల్లాలో శుక్రవారం మూడు కోవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఇందులో మంగళగిరి రూరల్ మండల పరిధిలో రెండు కరోనా కేసులు, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఒకటి గుర్తించినట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని హెచ్చరిస్తూన్నరు.