నిషేధిత గుట్కా ప్యాకెట్లను బడ్డీ కోట్లలో గుర్తించి స్వాధీనపరచు కోవడమే కాక దుకాణాల నిర్వహకులపై కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. తెనాలి చెంచుపేట డొంక రోడ్డులో ఓ బడ్డీ కొట్టులో త్రీటౌన్ ఎస్ఐ కలగయ్య, సిబ్బంది శుక్రవారం తనిఖీ చేయగా40 గుట్కా ప్యాకెట్లు, సమీపంలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద మరో దుకాణంలో 280 ప్యాకెట్లు లభించాయి. గుట్కాలను స్వాధీనం చేసుకొని నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa