పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గ సమీపంలోని గుండేపల్లి నుండి బొగ్గారం వెళ్ళు రహదారి పూర్తిగా దెబ్బతిని రవాణా ఇబ్బందిగా ఉందని ఆ ప్రాంత ప్రజలు, రైతుల విజ్ఞప్తి మేరకు సంఘం డైరీ నిధులతో 29.51 లక్షలు వెచ్చించి ఈ నెల 9వ తేదీన జిల్లా టీడీపీ నాయకులూ ఆంజనేయులు , గ్రామస్తులతో కలసి రోడ్డు నిర్మాణము ప్రారంభించారు. కానీ దీనికి సంభందించి ఇక్కడి వైసీపీ నాయకులూ ఎప్పుడో శంకుస్థాపన చేసారు కానీ పనులు మాత్రం చెయ్యని పరిస్థితి నెలకొంది , ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అభివృద్ది చేతకాని ప్రజావసరాల మీద కనీసం భాధ్యత లేని దద్దమ్మలు నేడు ఆ శిలాపలకాలు ద్వసం చేయటం సిగ్గుచేటు అని అన్నారు .