జిల్లాలో ఆయిల్ కంపెనీల ప్రతినిధులు సరిపడా ఆయిల్ నిల్వలు ఉంచుకోవాలని, జాయింట్ కలెక్టర్ రాజకుమారి సూచించారు. శుక్రవారం గుంటూరు కలెక్టరేట్ లోని జేసి ఛాంబర్ లో, ఐఓసి, హేపిసియల్, బిపిసియల్, ఆయిల్ కంపెనీల నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జేసి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రజల అవసరాలకు, వినియోగానికి సరిపడా అనుగుణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, లను అందుబాటులో ఉంచుకోవాలని, జేసి రాజకుమారి సూచించారు.