ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జె. సి, శ్రీనివాసులు పేర్కొన్నారు. మండల పరిధిలోని సూరేపల్లి కోనేటిపురం గ్రామాల్లోని సచివాలయాలను ఆయన సందర్శించారు. అనంతరం భట్టిప్రోలు తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతలు గుర్తెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ ఎం. ఎల్, శ్రావణ్ కుమార్, డి. టి, నిరంజన్ బాబు తదితరులు పాల్గొన్నారు.