గుంటూరు కలక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సిపిఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహమ్మద్ ప్రవక్త పై బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గుంటూరు శనివారం ఉదయం కలెక్టరేట్ వద్ద సిపిఎం నాయకులు ధర్నా చేపట్టారు. ధర్నాకు అనుమతి లేనందున ధర్నా చేస్తున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఇతర సిపిఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.