ద్వాదశ జోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం క్షేత్రానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుంటున్నారు. స్వామి అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు, భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. దేవస్థానం వసతి గృహలు, ప్రైవేటు సంస్థలు కిటకిటలాడుతున్నాయి. దర్శనానంతరం భక్తులు, స్థానిక సందర్శనీయ స్థలాలైన సాక్షి గణపతి, హటకేశ్వరం, పాలధార-పంచదారం, శిఖరేశ్వరం, శ్రీశైలం డ్యాం తదితరాలను సందర్శించుకున్నారు. అది, సోమవారం కూడా రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రదేశాలలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు.