చీరాల ఏరియా లో నాటు సారా తయారీ, విక్రయాలు, ఇసుక తవ్వకాలు అక్రమ రవాణా పూర్తిగా ఆగిపోయాయని జిల్లా ఎస్పీ జిందాల్ కు తప్పుడు అభిప్రాయం కలిగించే విధంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల పనితీరు ఉంది. గత 15 రోజులుగా చీరాల ప్రాంతంలో సెబ్ అధికారులు దాడులు చేసిన దాఖలాలే లేవు. ఒకప్పుడు రోజుకు రెండు ప్రాంతాల్లో కూడా ఈ దాడులు జరిగేవి. మరిప్పుడు సెబ్ అధికారులు ఎందుకు రిలాక్సవుతున్నారో వారికే తెలియాలి.