వినియోగదారులకు మెరుగైన విద్యుత్ ను అందించడమే తమ ధ్యేయమని, విద్యుత్ ఏడిఏ రుక్మాంధ్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పీటీఎం విద్యుత్ సబ్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ. తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎక్కువ మోతాదులో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎస్టి, ఎస్సి లు 200 లోపు యూనిట్లు విద్యుత్ వినియోగిస్తే, ఎలాంటి బిల్లులు ఉండవని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ రామలక్ష్మయ్య, సిబ్బంది, పాల్గొన్నారు.