నియోజకవర్గ కేంద్రమైన నాగాయలంక, కోడూరు మండలం నుంచి గోవుల అక్రమ రవాణా కొనసాగుతుంది. వారానికి 100ల సంఖ్యలో గోవులు కబేలాలకు తరలి వెళ్లిపోతున్నాయి. ముఖ్యముగా కోడూరు మండలం పాలకాయతిప్ప, పెదగుడుమోటు, నాగాయలంక మండలం ట్. కొత్తపాలెం, తలగడదీవి కేంద్రముగా మారు బేరగాళ్లు కబేలా మాఫియాతో చేతులు కలిపి గుంటూరు జిల్లాకు మరియు కరకట్ట మీదుగా విజయవాడ వైపు నుండి హైద్రాబాద్ తరలిస్తున్నారు. ఈ విషయమై అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని పలువురు గో సంరక్షకులు కోరుతున్నారు.