కృష్ణా జిల్లా: బందరు కోటలో పునః నిర్మితమైన శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా ప్రతిష్టా మూర్తులకు నిర్వహిస్తున్న జైత్ర యాత్ర 2వ రోజుకు చేరింది. ఈ రోజు ఉదయం 10గంటలకు బందరు కోటలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నుండి జైత్ర యాత్ర ప్రారంభమై సాయంత్రం కోదంద రామ స్వామి ఆలయానికి చేరుకోనుంది. రేపటి నుండి మూడు రోజుల పాటు ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహించనున్నారు.