కేంద్ర ప్రభుత్వం హైసెక్యూరిటీ నెంబరు ప్లేట్లను తప్పనిసరి చేస్తూ 2013 డిసెంబరులో చట్టంలో సవరణలు తెచ్చింది. ఇది పూర్తి స్థాయిలో 2014 నుంచి అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి వాహ నానికి విధిగా ఈ రకం ప్లేట్లనే ఏర్పాటు చేయా ల్సి ఉంది. కానీ ఈ నిబంధనను ఉల్లంఘించి చాలా మంది సొంత నెంబర్ ప్లేట్లను బిగిస్తు న్నారు. ప్రభుత్వ వాహనాలకు సంబంధించి కూడా నెంబరు ప్లేట్ల ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్నాయి.
ప్లేట్లపై సంబంధిత అధికారి హోదా, శాఖను తెలిపేలా బోర్డులు పెడుతున్నారు. ఇది కూడా మోటారు వాహనాల నిబంధనలకు వ్యతిరేకం. పలు వాహనాలు హైసెక్యూరిటీ ప్లేట్లను తొలగించి సొంత వాటిని బిగించారు. ఇకపై తప్పనిసరిగా ప్రభుత్వ వాహనాలతో పాటు అద్దె వాటికి కూడా ఈ రకమైన ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంగా నిర్దేశిం చారు. హైసెక్యూరిటీ ప్లేట్లలో సంబంధిత వాహనం ఇంజిన్ నెంబరు, ఛాసిస్ నెంబర్ల వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. ఇటీవలి కాలం లో డీలర్లు బిగించిన ప్లేట్లను చాలా మంది ఉద్దేశపూర్వకంగా వంచుతున్నారు. దీని వల్లకెమెరాలు బండి నెంబరును గుర్తించలేక పోతున్నాయి.
కొంతమంది ఫ్యాన్సీ నెంబర్లపై మోజుతో తమకు నచ్చినట్లుగా అంకెలను రాయించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ అధికారులు కారు వినియోగించు కునే సౌకర్యాన్ని కల్పించింది. అయితే చాలా మంది అధికారులు సొంత కార్లోనే అద్దె కార్ల పేరుతో వినియోగిస్తున్నారు. అద్దె కారుకు సంబంధించి రవాణా శాఖలో పాసింజర్ వాహనం కింద పన్ను కట్టాల్సి ఉంది. ఆ విధం గా పన్ను చెల్లించిన దాఖలాలు కనిపించడం లేదు. వాటిపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని తప్పనిసరిగా రాయాలి. కానీ చాలా మంది అధికారులు ప్రభుత్వ వాహనం అని ప్లేట్ ఉప యోగిస్తున్నారు.
నంబర్ ప్లేట్ పసుపు రంగు లో ఉండాలి. కానీ అధికారులు ఆ నిబంధనలు పాటించడం లేదు. మరోవైపు కొంతమంది బడాబాబులు తమకార్ల విండోసు బ్లాక్, గ్రీన్ స్టిక్కరింగ్ చేస్తున్నారు. ఇటువంటి వాటిపై కూడా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా మేల్కొని వాహనం నిబంధనలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.