ఎన్టీఆర్ జిల్లాలో మన బడి నాడు-నేడు కార్యక్రమం రెండో దశలో రూ. 156 కోట్ల వ్యయంతో 372 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు తెలిపారు. కలెక్టర్ కార్యా లయ ఆవరణలో నాడు-నేడు మొదటి దశలో భాగంగా పూర్తి చేసిన పాఠశాలల అభివృ ద్దిపై ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఫొటో ప్రదర్శనను తిలకించిన అనంతరం సమగ్ర శిక్ష అభియాన్, విద్యాశాఖ, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు-నేడు మొదటి దశ కింద రూ. 78. 79 కోట్లతో 341 పాఠశాలలను అభివృద్ధి చేశామన్నారు. గతంలో ప్రభుత్వ పాఠ శాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు లేక పోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదు ర్కొ నేవారన్నారు. అపరిశుభ్రమైన వాతావరణం, అరకొర వసతులు, కనీసం టాయిలెట్ల సౌకర్యం కూడా లేకపోడంతో ప్రభుత్వ పాఠశాలలపై చిన్న చూపు ఉండేదన్నారు. సీఎం వైఎస్ జగన్ విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పూర్తి స్థాయిలో మార్పు సాధ్యమవుతోందన్నారు. | నాడు-నేడులో భాగంగా పాఠశాల భవనా లను నూతన భవనాలుగా తీర్చిదిద్దడం తోపాటు తరగతి గదులలో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, బ్లాక్ బోర్డులు, ఇంగ్లిష్ ల్యా బ్లు , ఫర్ని చర్, అధునాతన వసతులతో టాయిలెట్ల నిర్మాణం, రక్షిత తాగునీటి సౌకర్యాన్ని కల్పిం చడంతోపాటు కిచన్ షెడ్లు నిర్మించినట్లు కలె క్టర్ వివరించారు.
మొదటి దశలో 60 అదనపు గదులు నిర్మా ణాలను చేపడితే, రెండో దశలో 736 అదనపు గదులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. - కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతి ద్వారా తల్లి దండ్రుల కమిటీకే పాఠశాల భవన నిర్మాణా లను అప్పగించడం వల్ల పారదర్శకంగా పనులను పూర్తి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షణ అభియాన్ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ ఎ. శేఖర్, డీఈఓ సీవీ రేణుక, సెక్టోరల్ ఆఫీసర్లు ఎల్. వెంకటేశ్వరరావు, ఎస్. రాంబాబు, కె. సుధాకర్ పాల్గొన్నారు.