ఇంటర్మీడియెట్ కోర్సు ప్రాధాన్యత దృష్యా జూనియర్ కాలేజీల నిర్వహణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నిబంధనలు పాటించని కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసిం ది. గుర్తింపు కోసం కాలేజీ యాజమన్యాలు సమర్పించిన దరఖాస్తుల్లో వాస్తవమెంత అనేది క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని ఆదేశించింది. ఈ నేప థ్యంలోనే ప్రత్యేక బృందాలు జూనియర్ కాలేజీల్లో తనిఖీలు చేస్తున్నాయి. తనిఖీలకు త్రీమెన్ కమిటీ. 2022-28 విద్యా సంవత్సరంలో జూలై 1న ఇంట ర్మీడియెట్ తరగతులు ప్రారంభించాల్సి ఉన్నం దున, అధికారులు ఇందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే జూనియర్ కాలేజీలు నిర్వహణకు గుర్తింపు ఇచ్చే క్రమంలో నిబంధనలు కచ్చితంగా పాటించా ల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలేజీల్లో తనిఖీలకు ఒక సీనియర్ ప్రిన్సిపాల్, ఫిజిక్స్, జువాలజీ లెక్చరర్లతో కూడిన త్రీ మెన్ కమిటీ నియమించింది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎనిమిదికమిటీలు ఏర్పాటు చేయగా, వీరంతా తనిఖీల్లో నిమగ్నమయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇదీ పరిస్థితి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 320 జూనియర్ కాలేజీలకు ప్రభుత్వ గుర్తిం పు ఉంది. వీటిలో 2021-22 విద్యా సంవత్సరంలో 284 కాలేజీల్లోనే అడ్మిషన్లు జరిగినట్లు తేలింది. ఇందులో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 51 కాలేజీలు ఉండగా, మిగతా 238 ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో నిర్వహిస్తున్నారు. వీటిలో అత్యధికంగా విజయవాడ, నగర సమీప ప్రాంతంలోనే ఉన్నాయి.
పరిశీలన ఇలా: తనిఖీలు ఏ ప్రాతిపదికన చేయాలనేది ఇంటర్మీడియెట్ బోర్డు ముందుగానే నిర్దిష్టమైన ప్రొఫార్మా రూపొందించింది. దాని ప్రకారం కాలేజీల నిర్వ హణకు అనువైన భవనాలు, దీనికి సంబంధించిన వాస్తవ ధ్రువీకరణ పత్రాలు, ఫైర్ సేఫ్టీ, ఆట స్థలం, సైన్సు ల్యాబ్, అర్హత కలిగిన అధ్యాపకులు ఎంత మంది ఉన్నారనేది కమిటీ పూర్తి స్తాయిలో పరిశీలి స్తున్నారు. తనిఖీల్లో గుర్తించిన అంశాలను బృందం సభ్యులు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. అన్ని రకాల నిబంధనలు పాటించిన కాలేజీలకే 2022-28 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఇంట ర్మీడియెట్ బోర్డు అనుమతి ఇవ్వనుంది. కార్పొ రేటకు అడ్డుకట్ట. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, కంకిపాడు, ఉయ్యూరు కేంద్రాలుగా కార్పొరేట్ యాజమాన్యాల పరిధిలో రెసిడెన్షియల్ కాలేజీలను నిర్వహిస్తు న్నారు. పోటీ పరీక్షల పేరుతో విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు ఫీజు రూపేణా వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ సరైన వసతులు, అర్హత గల అధ్యాపకులు లేకుండా, ఇరుకు గదుల్లో బట్టీ చదువులు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపడతున్న తనిఖీలు విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నాయి.