వైసీపీ ప్రభుత్వం హయాంలో వేధింపులు ఎదుర్కొన్న కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం చౌడవరానికి చెందిన యర్రంశెట్టి సాయికృష్ణను మంత్రి నారా లోకేష్ కలిశారు. ఉండవల్లిలోని తన నివాసానికి సాయికృష్ణను పిలిపించిన లోకేష్.. అతనితో ముచ్చటించారు. నవంబర్ 8న మంత్రి లోకేష్‌ను కలిసేలా అనుగ్రహించాలంటూ సాయికృష్ణ మోకాలిపై దుర్గగుడి మెట్లెక్కారు. తన ఆకాంక్షను ఎక్స్ ద్వారా తెలియజేశారు. దీంతో నారా లోకేష్ వెంటనే స్పందించారు. ఉండవల్లి నివాసంలో సాయికృష్ణను పిలిపించి అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్లకార్డుల ద్వారా సాయికృష్ణ శాంతియుతంగా నిరసన గళం వినిపించారు. సాయికృష్ణ పోరాటాన్ని మంత్రి నారా లోకేష్ అభినందించారు.