పోలీసు స్టేషనుకు వచ్చే ఫిర్యాదిదారులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ తెలిపారు. వాల్మీకి పురం పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేసి సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. మండలంలో రాత్రి గస్తీ పెంచి అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని చెప్పారు. మైనర్లు వాహనాలు ఇవ్వకుండా వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.