చిత్తూరు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్రాంచ్ ఎదురుగా వెలసిన శ్రీ మొడుక్కు మారిఅమ్మ దేవాలయ కుంభాభిషేకం జరిగి 4వ వార్షికోత్సవశుభ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం పెద్ద ఎత్తున మహిళా భక్తులు భక్తిశ్రద్దలతో పాల కళశాలను ఊరేగింపుగా తీసుకొచ్చి మూలవిరాట్ అమ్మ వారికి విశేష అభిషేకాలు చేసారు. చిత్తూరు నగర పాలక సంస్థ మాజీ కార్పొరేటర్ రాణి ఉదయ్, పెద్ద హరిజన వాడ పుర పెద్ద, ఆలయ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రజలు అమ్మవారి పూజలలో పాల్గొన్నారు.