కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని సిద్దాపుర్కు చెందిన తృప్తి మంజునాథ అనే యువతి జాతీయ గీతాన్ని ఆకులపై హిందీలో చెక్కి అరుదైన ఘనత సాధించింది. ఆమె లీఫ్ ఆర్ట్‌తో విభిన్న కళాకృతులను రూపొందిస్తుంటుంది. ఈ క్రమంలో ఒక్కరోజులోనే ఆకులతో జాతీయ గీతాన్ని తీర్చిదిద్దింది. దీంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు సంపాదించింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈ యువతి బీఈడీ సెకండియర్ చదువుతోంది.