ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ పరిపాలనలో రోడ్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 11:32 AM

దోచుకోవడమే ప్రధాన ఎజెండాగా చంద్రబాబు ఐదేళ్ల పాలన సాగిందని ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. చంద్రబాబు కక్కుర్తి పనులు కొన్ని వ్యవస్థలకు శాపాలయ్యాయన్నారు. మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం ఖర్చు చేయాల్సిన రూ.300 – 400 కోట్లను తమ సొంత అవసరాలకు చంద్రబాబు వాడుకున్నాడని ధ్వజమెత్తారు. ఇప్పుడు దత్తపుత్రుడు, ఎల్లోమీడియాతో అసత్య ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పరిపాలనలో రోడ్లకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో రూ.2,205 కోట్లతో రహదారుల నిర్మాణాలు, మరమ్మతు పనులు జరుగుతున్నాయని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com