రైతుల్ని ఆదుకోవాలంటూ సీఎం జగన్ కి టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ లేఖ రాసినట్లు తెలిపారు. రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... రైతురాజ్యం తెస్తానని ప్రభుత్వంలోకొచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రమంతా క్రాప్‌హాలీడేలు ప్రకటించడం వల్ల రైతుల్లేని రాష్ట్రంగా మారుతోంది. రైతులు క్రాప్‌హాలీడే విరమించేలా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైతుల్ని ఆదుకుని వ్యవసాయరంగ సంక్షోభాన్ని నివారించాలనే చిత్తశుద్ధి మీ ప్రభుత్వానికి ఉంటే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం ఆపేయాలి. పంటలకు మద్దతు ధర అందించాలి. ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ.7 లక్షలు ఇవ్వాలి. పంట నష్టపరిహారం చెల్లించాలి. పోలవరం పూర్తిచేసి నదుల అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందించాలి అని డిమాండ్ చేసారు.