ప్రజల్లో జగన్ రెడ్డి పట్ల వ్యతిరేకత పెల్లుబుకుతున్నా వైసీపీ నేతల కుల అహంకార దౌర్జన్యం ఏమాత్రం తగ్గడం లేదు అంటున్నారు అనంతపురం టీడీపీ నాయకులూ. తాజాగా తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం దళిత కౌన్సిలర్ మల్లికార్జున డ్రైనేజ్ కి సంబంధించిన పనులు చేయిస్తుండగా... సుమారు 70 మంది వైసీపీ రౌడీలు ఆయనపై విచక్షణ రహితంగా దాడి చేసినట్లు వీడియో రూపంలో తెలియజేసారు. ఆ 70 మందితో దాడి చేయించింది వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కొడుకు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అని వీరు ఆరోపిస్తున్నారు.