కొల్లిపర విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ఇంచార్జి ఎంఈవో శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు అవసరమైన 18, 000 పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం తొలి విడుతలో అందజేసిందని ఆయన పేర్కొన్నారు. మొత్తం 3, 200 మందికి పంపిణీ చేయాల్సి ఉందని వివరించారు.