కోసిగి మండలం కొలమానం పేటకు చెందిన హుస్సేన్ కడుపునొప్పి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని రోజుల నుండి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఎంతమంది వైద్యులకు చూపించిన తగ్గకపోవడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.