ఆళ్లగడ్డ పట్టణంలో శనివారం నిర్వహించిన టిడిపి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కార్యకర్తలు ఉత్సాహంగా హాజరు కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.