ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగ్న ఫోటోలతో గ్రహాంతవాసులకు వల...నాసా శాస్త్రవేతల వినూత్న ప్రయోగం

international |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 11:25 PM

గ్రహాంతవాసులను దారిలోకి తెచ్చేకొనేందుకు గత కొన్నేళ్లుగా నాసా  శాస్త్రవేతలు  చేయని ప్రయోగంలేదు.  కానీ అది ఇంతవరకు ఫలించలేదు.  దేనికీ లొంగనివారు కామానికి మాత్రం లొంగుతారు. చివరగా అదే అస్త్రాన్ని నాసా ప్రయోగిస్తోందా అంటే అవుననే చెప్పవచ్చు. మన సౌర కుటుంబంలో గ్రహాంతరవాసుల గురించి అనేక శతాబ్దాలుగా అన్వేషణ కొనసాగుతోంది. ఇంతకీ ఏలియన్స్ ఉన్నారా? అయితే ఎక్కడ ఉంటారు? మనతో మాట్లాడుతారా? మన చర్యలకు స్పందిస్తారా? అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు శాస్త్రవేత్తలు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా గ్రహాంతరవాసులను ఆకర్షించడానికి నగ్న ఫోటోలను నాసా శాస్త్రవేత్తల బృందం అంతరిక్షంలోని పంపుతోంది. గ్రహాంతరవాసులతో కమ్యూనికేట్ చేయాలని గత 150 ఏళ్లుగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఏలియన్స్‌ను ఆకర్షించడానికి ఈ విధానాన్ని ఉపయోగించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇద్దరు మానవుల నగ్న ఫోటోలను పంపాలని నిర్ణయించుకున్నారు.


‘బీకాన్ ఇన్ ది గెలాక్సీ’ అనే ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ప్రయత్నం చేపట్టారు. పూర్తిగా నగ్నంగా, చేతులు పైకెత్తి హలో చెబుతున్న భంగిమలో ఉన్న స్త్రీ, పురుషుల ఫోటోలను పంపుతున్నారు. ‘బీకాన్ ఇన్ ది గెలాక్సీ’  ప్రాజెక్ట్ ఇతర అంతరిక్ష నాగరికతలకు సంబంధించిన మానవులను సంప్రదించే సందేశాన్ని పంపడం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం నగ్న ఫోటోలే కాకుండా గురుత్వాకర్షణ, డీఎన్ఏ నమూనాల చిత్రాలను కూడా చేర్చారు.


పాలపుంత గెలాక్సీలోని గ్రహాంతరవాసుల జీవన శైలిని తెలుసుకోడానికి బైనరీ-కోడెడ్ సందేశాన్ని సృష్టించినట్టు ప్రాజెక్ట్‌ కోసం పనిచేస్తున్న శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘‘మానవ పరంగా గణిత శాస్త్రం భావనను మించి తెలివితేటలకు గుర్తించలేనప్పటికీ బైనరీ అనేది అన్ని తెలివితేటలలో సార్వత్రికమైంది.. బైనరీ గణితశాస్త్రం సరళమైన రూపం.. ఎందుకంటే ఇది రెండు వ్యతిరేక స్థితులను మాత్రమే కలిగి ఉంటుంది... అవి సున్నా- ఒకటి, అవును- కాదు, నలుపు- తెలుపు, ద్రవ్యరాశి -ఖాళీ స్థలం’ అని తెలిపారు.


స్త్రీ, పురుషుల నగ్న చిత్రాలతో పాటు డీఎన్ఏ అణువుల నిర్మాణ క్రమాన్ని కూడా జోడించారు. ‘మానవుల నగ్న చిత్రాలు, డీఎన్ఏ నిర్మాణం ఎడమవైపున ఉండే వస్తు మార్గంతో పాటు ఫోటో దిశ ఎవరికైనా సహాయం చేస్తుంది’ అని చెప్పారు. ‘ప్రతిపాదిత సందేశంలో సార్వత్రిక కమ్యూనికేషన్ సాధనాలను ఏర్పాటు చేయడానికి ప్రాథమిక గణిత, భౌతిక భావనలను వినియోగించారు.. తర్వాత భూమిపై జీవుల జీవరసాయన కూర్పుపై సమాచారం... పాలపుంతలోని నక్షత్రాల సమూహం, సౌర వ్యవస్థ, భూమి ఉపరితలం వర్ణనలు డిజిటలైజ్ చేశాం’ అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘బీకాన్ ఇన్ ది గెలాక్సీ’  కోడ్ బైనరీ ట్రాన్స్‌మిషన్‌పై ఆధారపడి ఉంటుంది.. ఇది అన్ని గ్రహాంతర జీవులకు అర్థం అయ్యే అవకాశం ఉందని తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com