కనిగిరి నగర పంచాయతీ లోని 8వ వార్డు లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో కనిగిరి శాసన సభ్యులు బుర్రా మధు సూదన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే గడపగడపకు మా ప్రభుత్వం కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యమని ఆయన అన్నారు.