ఏపీలోని 15.61 లక్షల మంది రైతులకు రూ.2,977.82 కోట్ల పంటల బీమా పరిహారాన్ని పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. లబ్ధిదారుల జాబితాలను ఇప్పటికే ఆర్బీకేల్లో ప్రదర్శించింది. అనంతపురం జిల్లా సీకే పల్లిలో మంగళవారం జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బీమా సొమ్ము పంపిణీ చేయనున్నారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద గత మూడేళ్లలో 44.61 లక్షల మంది రైతులకు రూ.6,684.84 కోట్ల మేర లబ్ధి చేకూరింది.