పెళ్లైన 3 రోజులకే ప్రియుడితో వధువు పారిపోయిన ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో ఆదివారం జరిగింది. మాధవరంకి చెందిన యువతికి జూన్ 9న సమీప గ్రామానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి జరిగింది. అయితే ఆమె పెళ్లికి ముందే మాధవరానికి చెందిన శివాజీని ప్రేమించింది. పెళ్లైన మూడో రోజే శివాజీతో వెళ్లిపోయింది. దీంతో వధూవరుల బంధువులు శివాజీ ఇంటికి నిప్పుపెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.