గుడ్లు, పెరుగును ఆహారంగా తీసుకుంటే మాడుకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుతుంది. జుట్టు రాలడం, పలుచబడడం తగ్గుతుంది. సాల్మన్ చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి. జుట్టు పొడిబారకుండా చూస్తాయి. దాల్చిన చెక్క కుదుళ్లకు పోషణనిస్తుంది. పప్పుల్లోని మాంసకృత్తులు, ఇనుము జుట్టుకు మేలు చేస్తాయి. చిలగడ దుంప, బాదం కూడా జుట్టుకు మేలు చేస్తాయి.