గుంటూరు: తోటలో ప్రార్ధనలకు వచ్చి మహిళ అదృశ్యమైన ఘటన పెదకాకానిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు ఎన్టీఆర్ జిల్లా పామర్రుకు చెందిన మహిళ తన కుమార్తె స్నాహ్నితను వెంటబెట్టుకుని తన అమ్మమ్మ సీతతో కలిసి పెదకాకాని తోటలో జరిగే ప్రార్ధనలకు వెళ్లి అదృశ్యమైంది. బంధువుల ఫిర్యాదు మేరకు పెదకాకాని పోలీసులు అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారు సురేష్ బాబు తెలిపారు.