సౌతాఫ్రికాతో జరుగుతోన్న ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా జట్టులో వికెట్లు తీసే బౌలర్లు లేరని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. భువనేశ్వర్ కుమార్ తప్పా మరెవరూ వికెట్లు తీయలేకపోతున్నారని, దాంతోనే వరుస మ్యాచ్ల్లో భారత్ ఓటమి పాలైందని తెలిపాడు. కటక్ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లోనూ భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
టీమ్ ఇండియా జట్టులో భువనేశ్వర్ కుమార్ మినహా వికెట్లు తీసిన బౌలర్ ఎవరూ లేరు. అదే ఈ సిరీస్లో పెద్ద సమస్య. వికెట్లు తీయడం వల్ల ప్రత్యర్థిపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే తొలి టీ20లో 211 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. రెండో మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీసి లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయాడు అని గవాస్కర్ అన్నారు.