యూపీలో 12 వేల జంటలు పెళ్లిళ్లు చేసుకున్నాయి. శుక్రవారం ఉత్తరప్రదేశ్ లో సామూహిక వివాహ వేడుక వైభవంగా జరిగింది. 60 జిల్లాల్లో జరిగిన సామూహిక పెళ్లిళ్ల వేడుకల్లో 12 వేల జంటలు ఒక్కటయ్యాయి. మతాలకు అతీతంగా ఈ పెళ్లిళ్లు జరిగాయి. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఒక్కో వధువు ఖాతాలో రూ.35 వేల చొప్పున జమ చేసి వధూవరులను ఆశీర్వదించింది.