గుజరాత్లోని మోర్బీ జిల్లాలో భారీ వర్షాలకు మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. హల్వాద్ తాలూకా సుందరీభవాని గ్రామంలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబంలోని భార్య, ఆమె భర్త, సోదరుడు మరణించినట్లు హల్వాద్ పోలీస్ స్టేషన్ పోలీసులు సోమవారం తెలిపారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.