పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనారోగ్యాలపై ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినా, వాటి విక్రయాలు తగ్గడం లేదు. ఈ తరుణంలో కెనడా ప్రభుత్వం ఇటీవల సరికొత్త నిర్ణయం తీసుకుంది. సిగరెట్ పెట్టెపైనే కాకుండా, ప్రతి సిగరెట్‌పైనా హెచ్చరికను ముద్రించేలా ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఆదేశాలిచ్చిన మొదటి దేశంగా కెనడా నిలిచింది. అయితే ఇలాంటి నిర్ణయాలు అక్కడి ధూమపాన ప్రియులకు అడ్డుకట్ట వేయడం లేదని తెలుస్తోంది.