ఓ కలెక్టర్ తాను పెంచుకుంటున్న ఆవుకు అనారోగ్యం చేసిందని ఏడుగురు వైద్యులను నియమించిన ఘటన ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కలెక్టర్ అనుప్రియా దూబే తన పెంపుడు ఆవు చికిత్సకు జిల్లా చీఫ్ వెటర్నరీ అధికారి ఎస్కే తివారీతో పాటుగా ఏడుగురు వెటర్నరీ డాక్టర్లను నియమించింది. అంతేకాకుండా ఆవును ప్రతిరోజు తనిఖీ చేసి రిపోర్టు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. కలెక్టర్ జారీ చేసిన లేఖ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.